Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాయు కాలుష్యంతో హృద్రోగాలు...

శుక్రవారం, 9 మార్చి 2018 (21:57 IST)

Widgets Magazine
pollution

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే కాకుండా, హృద్రోగ సమస్యలూ వస్తున్నాయని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు.
 
ముఖ్యంగా రక్తంలో చక్కెర శాతంతో పాటు కొలస్ట్రాల్ పెరగడానికి తద్వారా హృద్రోగ మరణాలకు దారితీస్తుందని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం దక్షిణ ఇజ్రాయెల్‌లో వాయుకాలుష్యానికి గురవుతున్న కొందరు వ్యక్తుల మీద ఈ ప్రభావాన్ని లెక్కించారట. 
 
గాలిలో ఏరోసల్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నివసించే వాళ్ల రక్త నమూనాలను పదేళ్లపాటు నిరంతరాయంగా సేకరించి పరిశీలించారట. వాటిల్లో రక్తంలో చెడు కొలస్ట్రాల్ బాగా పెరగడంతో పాటు మంచి కొలస్ట్రాల్ తగ్గిందట. అంతేకాదు, సాధారణ వ్యక్తులతో పోలిస్తే చక్కెర రోగుల్లో చెడు కొలస్ట్రాల్ చాలా ఎక్కువగా పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి వాయుకాలుష్యం వల్ల హృద్రోగాలు పెరుగుతున్నాయని వాళ్లు విశ్లేషిస్తున్నారు. కాబట్టి మనచుట్టూ ఉన్న గాలిమీద ఓ కన్ను వేయాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఎండలు అదరగొట్టినా పుదీనా తీసుకుంటే చాలు... అందులో ఏముందో తెలుసా?

ఎండ తాపాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాల్లో పుదీనా కూడా ఉంటుంది. అందుకే ...

news

మందార పూలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి... అవేంటో తెలుసుకోండి...

పువ్వులు అనగానే అవి కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగపడుతాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి ...

news

చుండ్రును వదిలించుకునేందుకు సహజసిద్ధమైన పద్ధతులు ఇవే...

చాలామంది చుండ్రు సమస్యతో తలలో వేళ్లు పెట్టి గీకుతూ వుంటారు. పదిమంది చూస్తున్నారన్న ధ్యాస ...

news

మష్రూమ్స్ తింటే.. గుండెకు మేలు.. ఎలా?

మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరంలోని ...

Widgets Magazine