మధుమేహానికి మందులు అక్కర్లేదట.. ఇలా చేస్తే చాలట..

గురువారం, 7 డిశెంబరు 2017 (18:03 IST)

diabetes

ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు మన భారత దేశంలోనే వున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం వున్నట్లైతే ఇక మందులు వాడాల్సిందేనని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు.

అయితే తాజాగా మధుమేహ వ్యాధిగ్రస్థులు (టైప్-2 డయాబెటిస్) మందులు వాడాల్సిన అవసరం లేదని సమతుల ఆహారంతోనే రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చునని న్యూ క్యాజిల్, గ్లౌస్ గౌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
సమతుల ఆహారంతో పాటు వ్యాయామం చేయడం, బరువు తగ్గడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ద లాన్ సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ద్వారా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు బరువు తగ్గిన మధుమేహ వ్యాధిగ్రస్థులు సగం మంది మందులు వాడటాన్ని నిలిపేశారు. వారు కేలరీలు తక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకున్నారు. తద్వారా బరువు తగ్గారు. దీంతో 45శాతం మంది రోగులు మందులు వాడాల్సిన అవసరం తప్పిందని పరిశోధకులు రాయ్ టేటర్, మైక్ లీన్‌లు తెలిపారు.  
 
బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల ఇన్సులిన్‌ను విడుద‌ల చేసే పాంక్రియాస్ గ్రంథిలో కొవ్వు నిల్వ‌లు క‌రిగిపోతాయ‌ని, త‌త్ఫ‌లింగా మ‌రింత ఎక్కువ ఇన్సులిన్‌ను విడుద‌ల చేసే సామ‌ర్థ్యాన్ని పాంక్రియాస్ సంత‌రించుకుంటుంద‌ని పరిశోధకులు వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఒత్తిడిని మాయం చేసే తులసీ ఆకుల టీ

తులసీ ఆకుల్లో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే తులసీని ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ...

news

బరువు తగ్గాలంటే మీరు చేయాల్సినవి ఇవే...

బరువు తగ్గాలని ఆహారపు అలవాట్లను మార్చుకున్నారా..? పోషకాహారం తీసుకోకుండా కడుపు ...

news

జంక్ ఫుడ్‌ను పక్కనబెడితే సౌందర్యం మీ సొంతం

జంక్ ఫుడ్ అలవాటును మానుకుంటే అందంగా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీసుకునే ...

news

రోజుకో అరటిపండు తినండి.. లివర్‌ను శుభ్రం చేసుకోండి.

రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు ...

Widgets Magazine