శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (19:49 IST)

కొవ్వును కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచాలనుకుంటే... ఈ పాయింట్లు...

కొవ్వుని కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఇలా వ్యాయామం చేసి చూడండి. 1. శరీరానికి కావలసినంత నీరు అందకపోతే కణాలు ముడుచుకుపోతాయి. దానితో కండరాలు బిగుతుగా మారి మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలి

కొవ్వుని కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఇలా వ్యాయామం చేసి చూడండి. 
 
1. శరీరానికి కావలసినంత నీరు అందకపోతే కణాలు ముడుచుకుపోతాయి. దానితో కండరాలు బిగుతుగా మారి మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలి. అప్పుడే మీ కండరాలు దృఢంగా ఉంటాయి. 
 
2. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా రెండు వేరువేరు వ్యాయామాలు ఒకేసారి చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఉదాహరణకు జంపింగ్, పుల్ అప్స్ కలిపి చేయండి. హృదయ కండరాలకు బలం చేకూరుతుంది.
 
3. ఈత, సైక్లింగ్, పరుగు లాంటివి క్రమంతప్పకుండా చేయడం వల్ల కొవ్వు కరిగి కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే వీటిని క్రమంగా పెంచుతూ సమయాన్ని కూడా పొడిగించుకుంటూ వెళితే మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు గుండె కండరాలు బలపడతాయి.
 
4. అదే పనిగా వ్యాయామాలు చేయడం వల్ల శరీరం అలిసిపోతుంది. అది కోలుకుని తిరిగి శక్తి పుంజుకోవాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. కాబట్టి ప్రతిరోజు దాదాపు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. వారంలో ఒకసారి వ్యాయామాలకు స్వస్తి చెప్పాలి. ఇలా చేయడం వల్ల మరుసటి వారం అంతా మీరు నూతన ఉత్సాహంతో ఉండగలుగుతారు.
 
5. మార్పు అనేది శాశ్వతం. ఇది వ్యాయామాలకు వర్తిస్తుంది. రోజుల తరబడి ఒకే విధమైన వ్యాయామాలు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు.  కాబట్టి అప్పుడప్పుడు వాటిని మార్చటం మంచిది.