గుమ్మడికాయను తీసుకుంటే? జీర్ణవ్యవస్థకు?

సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధ

pumpkin
Kowsalya| Last Updated: గురువారం, 12 జులై 2018 (16:52 IST)
సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమయ్యే పదార్థం కుడా. దీన్ని గుజ్జుగా చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.

 
కూరగానో లేదా సాంబార్‌గానో వాడే ఈ గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కారణంగా వ్యాధినిరోధకశక్తిని గణనీయంగా పెంచుటలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, అధికంగా ఉంటాయి. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.
దీనిపై మరింత చదవండి :