Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏ ఆకులో ఏముందో తెలుసా? అదే....

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (18:23 IST)

Widgets Magazine
Pudina

మనకు ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషథ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ఏమున్నదో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.
 
1. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రి పూట ముఖానికిరాసి ప్రొద్దుటే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయటం వల్ల   మొటిమలు మచ్చలు తగ్గుతాయి.
 
2. వేపాకులను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎటువంటి మచ్చలయినా త్వరగా పోతాయి.
 
3. ఒక కప్పు వేపాకులను కొద్ది నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకట్టి, ఆ నీటిని ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది.
 
4. వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది.
 
5. రాత్రిపూట దిండు మీద తులసి ఆకుల్ని వుంచుకొని పడుకుంటే తలలో పేలు పారిపోవాల్సిందే.
 
6. తులసి రసంలో కొంచెం తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే బొంగురు పోయిన గొంతు మామూలుగా అవుతుంది.
 
7. ఒక పెద్దస్పూన్ తులసి రసం ప్రతి రోజు త్రాగితే రక్తం శుభ్రపడటమే కాక గొంతు ఇన్ఫెక్షన్, కడుపునొప్పి తగ్గుతుంది.
 
8. తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి.
 
9. సబ్జా ఆకు పిండి రసము తీసి చెవిలో పోసిన చెవినొప్పి తగ్గుతుంది.
 
10. మామిడి ఆకుల నుండి తీసిన పసరును కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రాగి జావలో ఏమున్నదో తెలుసా?

రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ...

news

బెండకాయ ముక్కలు.. రాగులు తీసుకుంటే?

ఎముకల బలానికి రోజుకు ఒక కప్పు బెండకాయ ముక్కలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ...

news

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని ...

news

పచ్చకర్పూరం... శృంగార సామర్థ్యం... ఎలాగంటే?

పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ...

Widgets Magazine