సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (17:06 IST)

శ్రీలంకలో అశాంతి... 10 రోజుల పాటు ఎమర్జెన్సీ

పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వ

పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వెల్లడించారు.
 
సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మైనార్టీ వర్గీయుల(ముస్లిం ప్రజలు)పై మెజారిటీ వర్గాల(బౌద్ధమతం ప్రజలు)కు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఇంకా జాప్యం చేస్తే పరిస్థితి చేజారిపోతుందని భావించిన శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన... అత్యవసరంగా దేశ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంత దేశ వ్యాప్తంగా సైనిక బలగాలను మొహరించడం జరిగింది.