Widgets Magazine

త్వరలో జియో ఫైబర్: రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో డీల్

ఆదివారం, 31 డిశెంబరు 2017 (16:22 IST)

JioFi

జియోకు, ఆర్‌కామ్‌ల మధ్య ఓ డీల్ కుదిరేలా వుంది. ఈ డీల్ కుదిరితే జియో నుంచి త్వరలో ఫైబర్ వచ్చేస్తుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేసే పనుల్లో బిజీగా వున్న జియో.. త్వరలో జియోఫైబర్ తేదీని ప్రకటిస్తుందని తెలుస్తోంది.
 
ఈ మేరకు జియో-ఆర్‌కామ్‌ల డీల్‌లో భాగంగా ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తుంది. 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 43వేల టవర్స్ కూడా ఈ డీల్‌లో భాగమేనని సమాచారం. ప్రస్తుతం వైర్‌లెస్ మార్కెట్లో తనదైన ముద్రవేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్‌ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో మరో అడుగు ముందుకేయాలని భావిస్తోంది.
 
ఫైబర్ నెట్‌వర్క్ ఖరీదు కావడంతో పాటు.. ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాల్సి వుంది. ఈ నేపథ్యంలో జియో ఫైబర్ అంటూ ముందుకొస్తుంది. దీని కోసం జియో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాల్సి వుంటుంది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఇందులో భాగంగానే ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కైవసం చేసుకుని జియో ఫైబర్ కోసం ప్రయత్నాలు మొదలెట్టింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో నెంబర్-1: అప్‌లోడ్ వేగంలో మాత్రం డౌన్

ఉచిత డేటా ఆఫర్‌తో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో ...

news

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్.. రూ.93 ప్లాన్‌తో 1 జీబీ డేటా

జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ ఆఫర్లు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. ఇటీవల రూ. 98 రీఛార్జీతో ...

news

జియోకు పోటీగా ఐడియా ఆఫర్.. రూ.309లకే రోజుకు 1.5 జీబీ డేటా

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా టెలికాం సంస్థలన్నీ వినియోగదారులకు ఆఫర్ల ...

news

ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరి కానుందా?

ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ...

Widgets Magazine