Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధింపులు..

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (12:04 IST)

Widgets Magazine
harassment

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా భద్రత లేదు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని బసుల్లో ప్రయాణిస్తుంటే ఓ పోకిరి లైంగికంగా వేధించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీకి చెందిన ఓ యువతి ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈ యువతి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లేందుకు 774 రూట్ నంబరు బస్సు ఎక్కింది. యువతి కిటికీ పక్కన సీటులో కూర్చొని పుస్తకం చదువుకుంటుండగా పక్కన కూర్చున్న 40 ఏళ్ల ప్రయాణికుడు యువతి నడుముపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించాడు.
 
ఈ విషయాన్ని బస్సులో ఉన్న ప్రయాణికుల దృష్టికి తీసుకెళ్లినా వారిలో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో యువతి ప్రయాణికుడి వేధిస్తుండగా తన మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో తీసింది. అనంతరం యువతి బస్సులో ప్రయాణికుడి లైంగికవేధింపుల గురించి వీడియో సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పట్టపగలే బస్సులో అసభ్యంగా తాకుతూ వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంలోనూ తాత్సారం చేశారు. దీన్ని ట్విట్టర్‌లోనూ పోస్టు చేసింది. దీంతో కదిలిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సుంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి ప్రతీకారం తప్పదు : నిర్మలా సీతారామన్

జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని ...

news

కాళ్ళపారాణి ఆరకముందే.. భర్తపై లైంగిక వేధింపుల కేసు...

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నూతన ...

news

కి'లేడీ' ఏఎస్పీ సునీతా రెడ్డి .. ముగ్గురితో వ్యవహారం నడిపిందా?

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగా పని చేస్తున్న సునీతారెడ్డి మామూలు లేడీ ...

news

బుట్టా రేణుకకు లాభాదాయక పదవీగండం..

వైకాపా ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ...

Widgets Magazine