Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మిమ్మల్ని షో దగ్గర కలుస్తా': గాయని... కారులో ఎక్కించుకుని పంట పొలాల్లో...

శుక్రవారం, 19 జనవరి 2018 (12:45 IST)

Widgets Magazine
singer mamata

ఇటీవల హర్యానా రాష్ట్రంలో కనిపించకుండా పోయిన గాయని మమతా శర్మ శవమై కనిపించింది. ఆమె మృతదేహం పంట పొలాల్లో లభ్యమైంది. అదీ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వగ్రామం బనియానీ సమీపంలో మృతదేహమై కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. 
 
గత ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మోహిత్‌తో కలసి సోనిపట్ జిల్లాలోని గోహనా పట్టణంలో సంగీత విభావరి కార్యక్రమానికి మమతా వెళ్లింది. ఆపై 10.30 గంటల సమయంలో మోహిత్, మమత కుటుంబీకులకు కాల్ చేసి, ఆమె మరికొందరితో కలసి ఇంకో కారులో వెళ్లిందని చెప్పాడు. 
 
వారు తనకు తెలుసునని, ఈవెంట్ వద్ద కలుస్తానని ఆమె చెప్పిందని, కానీ ఆమె అక్కడికి రాలేదని సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆమె సెల్ ఫోన్‌కు రింగ్ ఇస్తే, ఫోన్ రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు. ఆపై సోమవారం ఉదయానికి స్విచ్చాఫ్ వచ్చింది. ఆ వెంటనే మమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 
 
ఇంతలో ఆమె మృతదేహం రోహ్‌తక్ జిల్లాలోని బనియానీ సమీపంలోని పంట పొలాల్లో గురువారం మధ్యాహ్నం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు కారులో ఎవరు వెళ్లారన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు చెబుతుండగా, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించక పోవడంతోనే ఇంత ఘోరం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సయీద్‌ను ఉరితీస్తారా? లేదా? పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరో హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఉగ్రవాదం నిర్మూలన కోసం ...

news

శాడిస్ట్ రాజేష్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారంటే?

శోభనం రోజు రాత్రిని కాళరాత్రిగా మార్చి కట్టుకున్న భార్యకు జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా ...

news

టీడీపీని తెరాసలో విలీనం చేద్ధాం : మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

అగ్ని క్షిపణి 5 సక్సెస్ : చైనాకు వెన్నులో వణుకు

భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) అగ్ని క్షిపణి 5ను విజయవంతంగా ప్రయోగించింది. అణు ...

Widgets Magazine