Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

త్రిపురలో ఎర్రకోట బద్ధలు.. త్వరలో వామపక్ష ముక్త భారత్ : రవిశంకర్

శనివారం, 3 మార్చి 2018 (15:31 IST)

Widgets Magazine

త్రిపుర రాష్ట్రంలో ఎర్రకోట బద్ధలైంది. శనివారం వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో గత 25 యేళ్లుగా కొనసాగుతూ వచ్చిన సీపీఎం ప్రభుత్వ పాలనకు తెరపడింది. మొత్తం 60 అసెంబ్లీ సీట్లకుగాను 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఇందులో మొత్తం 41 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, అధికార సీపీఎం పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఫలితంగా త్రిపుర కోటపై కాషాయపు జెండా ఎగురనుంది. 
 
ముఖ్యంగా, రెండున్నర దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన లెఫ్ట్ ఫ్రెంట్‌ పానలకు చరమగీతం పాడి, బీజేపీ మూడింట రెండు వంతుల ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ అగ్రనేతలు సైతం లెఫ్ట్‌ ఫ్రెంట్‌ను గద్దెదింపుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఉబ్బితబ్బిబ్బులైపోతున్నారు. 
 
ఈ ఫలితాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ మీడియాతో మాట్లాడుతూ 'కాంగ్రెస్ ముక్త్ భారత్‌తో పాటు ఇప్పుడు వామపక్ష ముక్త్ భారత్‌కూడా సాకారమవుతోంది' అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈశాన్యమంతా బీజేపీతోనే ఉందని, మొదట్లో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని తాము నినదిస్తూ వచ్చామని, ఇప్పడు 'వామ్ పంత్ ముక్త్ భారత్' (వామపక్ష ముక్త భారత్) కూడా కనుచూరుమేరలోనే కనిపిస్తోందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

''ఏంషి షార్...'' ఫుల్లుగా మందుకొట్టిన యువతులు.... ఏం చేశారో తెలుసా?

వీకెండ్‌లో పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టిన యువతులు కారు స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. ...

news

పాఠం నేర్పిన గోవా రిజల్ట్స్ ... ఆగమేఘాలపై మేఘాలయకు పరుగోపరుగు

గోపా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ మంచి గుణపాఠం నేర్పాయి. ఈ రాష్ట్ర ఎన్నికల ...

news

పెద్దపులి, ఎలుగుబంటి ఫైట్ వీడియో చూడండి

పెద్దపులి, ఎలుగుబంటిల మధ్య జరిగిన ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...

news

పదండయ్యా... ఎప్పుడు చూసినా ప్రత్యేక హోదానేనా... చౌదరి చిందులు

తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదా అన్న పదం వినిపిస్తే చాలు... అంతెత్తున ...

Widgets Magazine