Widgets Magazine

లంచం ఇవ్వలేదనీ స్కూటరిస్టును చంపేసిన బెంగాల్ పోలీసులు

ఆదివారం, 21 జనవరి 2018 (17:31 IST)

police

హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రద్దీ కూడలిలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో సౌమెన్ దేబ్‌నాథ్ (49) హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నాడు. దీన్ని గుర్తించిన బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు ఆయనను ఆపారు. హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
దీంతో వలంటీర్లు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. స్థానికులు ఆయనను కాపాడేందుకు వెళ్ళారు. దీన్ని గమనించిన పోలీసు వాలంటీర్లు పారిపోయారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన దేబ్‌నాథ్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన ఆసుపత్రిలో మరణించారు. దీంతో మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెగ్యులర్ పోలీస్ సిబ్బంది, సివిక్ పోలీస్ వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీలో సంచలనం : 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ...

news

గవర్నర్‌కు తెరాస సభ్యత్వం ఇవ్వొచ్చు.. నరసింహన్‌కు భజన శాఖ కేటాయించండి

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ...

news

తెరాస సర్కారుకు గవర్నర్ చెక్కభజన చేస్తున్నారు : వీహెచ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ...

news

చదువుల్లో రాణించివుంటే ప్రొఫెసర్ అయివుండేవాడిని : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ...

Widgets Magazine