మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (16:32 IST)

'రాజ్యం మీద ఆశలేనివాడి కంటే గొప్ప రాజు ఎవడుంటాడు'... "అజ్ఞాతవాసి"పై హైపర్ ఆది (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం బుధవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ స్పందనలను ఫేస్‌బుక్‌లో వీడియోలో తెలియజేస్తున్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం బుధవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ స్పందనలను ఫేస్‌బుక్‌లో వీడియోలో తెలియజేస్తున్నారు. 
 
తాజాగా 'జబర్దస్త్' హైపర్ ఆది కూడా ఈ చిత్రాన్ని తిలకించి తన స్పందనను తెలిపాడు. 'అజ్ఞాతవాసి' చిత్రం చాలా చాలా బాగుందన్నారు. 'తమ్ముడు', 'తొలిప్రేమ' సమయంలో పవన్‌లో ఉన్న కామెడీ టైమింగ్ మళ్లీ ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు.
 
ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే పవన్ కోసం 10సార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, రావు రమేష్ల కోసమైతే వీలున్నప్పుడల్లా వెళ్లి చూడొచ్చన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సీరియస్గా చాలా చాలా బాగుందని చెప్పారు.
 
ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పిన 'రాజ్యం మీద ఆశలేనివాడికంటే గొప్ప రాజు ఎవడుంటాడు' అనే డైలాగ్ బాగుందన్నారు. ఇలాంటివి సినిమాలో చాలా డైలాగులుంటాయంటూ తన స్పందనను వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.