Widgets Magazine

''అజ్ఞాతవాసి'' నిర్మాతలకు కొత్త చిక్కు.. లార్గో వించ్ ఏం చేశాడంటే?

''అజ్ఞాతవాసి'' సినిమాకు కొత్త చిక్కు వచ్చింది. అజ్ఞాతవాసి నిర్మాతలను కోర్టుకు లాగుతానని లార్గోవించ్ సినిమా దర్శక నిర్మాత జెరోమ్ సాలి అన్నారు. తాను ఫ్రెంచ్ భాషలో తీసిన లార్గో వించ్ చిత్రాన్ని ఎలాంటి అన

selvi| Last Updated: ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (16:16 IST)
''అజ్ఞాతవాసి'' సినిమాకు కొత్త చిక్కు వచ్చింది. అజ్ఞాతవాసి నిర్మాతలను కోర్టుకు లాగుతానని లార్గోవించ్ సినిమా దర్శక నిర్మాత జెరోమ్ సాలి అన్నారు. తాను ఫ్రెంచ్ భాషలో తీసిన లార్గో వించ్ చిత్రాన్ని ఎలాంటి అనుమతి లేకుండా కాపీ కొట్టి అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కించారని ఆరోపిస్తున్న జెరోమ్.. ఫ్రాన్స్ లేదా అమెరికాల్లో కేసు వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించానని వెల్లడించారు.

ఇకపై ఆ సంస్థ తన చిత్రాలను ఇక్కడ విడుదల చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే గుణపాఠం చెప్తానని తెలిపారు. తాను ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు పంపించానని.. ఇది తొలి అడుగు మాత్రమేనని, నిర్మాతల నుంచి సరైన సమాధానం రాకుంటే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. చిత్రంలోని ఎన్నో సన్నివేశాలు, లొకేషన్లు చిత్రం నుంచి కాపీ కొట్టారని ఆరోపించారు.

టీ-సిరీస్‌కే ఈ సినిమా హక్కులు ఇచ్చానని.. కానీ టీ-సిరీస్, అజ్ఞాతవాసి టీమ్ మధ్య ఓ సెటిల్‌మెంట్ జరిగినట్లు తనకు తెలిసిందని.. తాను అనేకసార్లు టీ-సిరీస్‌ను సంప్రదించినా, సెటిల్‌మెంట్లపై నోరెత్తలేదని జెరోమ్ తెలిపారు.


దీనిపై మరింత చదవండి :