శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (16:12 IST)

ఒకే వేదికపై కంగన-కరణ్: నా లవ్‌స్టోరీ గురించి అందరికీ బాగా తెలుసు..

బాలీవుడ్ సెలెబ్రిటీలు కంగనా రనౌత్, కరణ్ జోహార్ అంటేనే వీరిద్దరికీ పొసగదని అందరూ అనుకుంటూ వుంటారు. అయితే విరుష్క రిసెప్షన్‌లో ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు ఆ అభిప్రాయం కాస్త మారిపోయింది. తాజాగా వీరిద్ద

బాలీవుడ్ సెలెబ్రిటీలు కంగనా రనౌత్, కరణ్ జోహార్ అంటేనే వీరిద్దరికీ పొసగదని అందరూ అనుకుంటూ వుంటారు. అయితే విరుష్క రిసెప్షన్‌లో ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు ఆ అభిప్రాయం కాస్త మారిపోయింది. తాజాగా వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం రాత్రి కంగనా రనౌత్, కరణ్ జోహార్‌లను ఒకే వేదిక మీద చూసినవారంతా వీరిమధ్య వివాదాల్లేవని డిసైడ్ అయిపోయారు. 
 
క‌ర‌ణ్ జొహార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ''ఇండియాస్ నెక్స్ట్ సూప‌ర్‌స్టార్'' కార్య‌క్ర‌మానికి కంగ‌నా అతిథిగా హాజ‌రైంది. వేదికపై వీరిద్దరూ నవ్వుతూ ప్రాణస్నేహితుల్లో కనిపించారు. ఇంతవరకు తమ మధ్య జరిగిన వాగ్వివాదం కేవలం సినీ రంగానికి సంబంధించినవే కానీ.. వ్యక్తిగతమైనవి కాదని.. తామెప్పుడూ స్నేహభావంతో మెలగుతామని తేల్చిచెప్పారు. 
 
ఇక ఇదే కార్య‌క్ర‌మంలో హృతిక్ రోష‌న్ గురించి కంగ‌నా రనౌత్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించ‌డం హైలైట్‌గా నిలిచింది. మీ ల‌వ్‌స్టోరీ గురించి చెప్పాల‌ని అడ‌గ్గా.. త‌న ల‌వ్‌స్టోరీ గురించి అందరికీ బాగా తెలుసునని తెలిపింది. మీడియాలో బాగానే కథనాలొచ్చాయిగా అంటూ జోకులు పేల్చింది.