Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (10:22 IST)

Widgets Magazine
ragm gopal varma

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రధారిగా గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పేరుతో ఓ పోర్న్ వెబ్ సిరీస్ మూవీని తెరకెక్కించి ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసిన విషయంతెల్సిందే. 
 
ఈ మూవీపై అనేక మహిళా సంఘాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన సీసీఎస్ పోలీసులు... తగిన చర్యలు తీసుకుని ఈ చిత్రం ప్రసారంపై నిషేధం విధించాయి. ఈనేపథ్యంలో శృంగారం పేరుతో అశ్లీల చిత్రాన్ని తీసిన ఆర్జీవీపై చర్య తీసుకోవాలన్న డిమాండ్లు ఉత్పన్నమవుతున్నాయి. 
 
దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ స్పందిస్తూ, మహిళా సంఘాల ఫిర్యాదుతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, శృంగారం పేరుతో అశ్లీల చిత్రాన్ని నిర్మించారంటూ ఆర్జీవీపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్టు వివరించారు. కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు పంపనున్నట్టు తెలిపారు. నోటీసులకు స్పందించకుంటే అవసరమైతే అరెస్ట్ చేస్తామన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Arrest Obscenity Charge Gst Movie Hyderabad Ccs Police Ram Gopal Varma

Loading comments ...

తెలుగు సినిమా

news

రైలులో మలయాళ నటికి వేధింపులు

మలయాళ నటి సనూష రైలులో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీంతో ఆ పోకిరీలను ఆమె అరెస్టు ...

news

ఒక నువ్వు ఒక నేను పాట.. విష్ణు.. శ్రియ నటన అదుర్స్ (వీడియో)

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో హీరోయిన్ శ్రియ గురించి విలక్షణ నటుడు మోహన్ బాబు ...

news

నా భార్య హర్షితకు మగ స్నేహితులే ఎక్కువ: హీరో సామ్రాట్

భార్య ఇంట్లో దొంగతనం కేసులో బెయిల్‌పై గురువారం విడుదలైన హీరో సామ్రాట్ భార్య హర్షిత పట్ల ...

news

నేను సెట్లో వుంటే హీరోయిన్ వైపు కన్నెత్తి చూడాలంటే ఎవరికైనా వణుకే: షారుక్

లైంగిక వేధింపులపై ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు స్పందించారు. తాము ఫలానా హీరో లేదా ...

Widgets Magazine