చిప్స్ తిన్నారో అంతే సంగతులు..

శుక్రవారం, 19 జనవరి 2018 (18:08 IST)

potato chips

రోజూ చిప్స్ తీసుకుంటున్నారా? అయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. శరీరానికి ఇది ప్రమాదకరమని.. ఆరోగ్య నిపుణులు చెప్పారు. సమయం దొరికితే చాలు.. గుప్పెడు చిప్స్‌ను చేతిలోకి తీసుకుని కరకర నమిలేస్తే ఆరోగ్యానికి దెబ్బేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఓసారి పర్లేదు కానీ రోజూ అదేపనిగా నూనెలో వేపిన స్నాక్స్‌ను తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు తప్పవో చూద్దాం... 
 
బరువు పెరిగిపోతారు.. 
రోజూ చిప్స్ తీసుకుంటే వాటిలోని హైఫ్యాట్ కెలోరీల ద్వారా బరువు పెరుగుతారు. ఒబిసిటీ తప్పదు. పది గ్రాముల చిప్స్‌లో 154 కెలోరీలు వుంటాయి. ముఖ్యంగా పొటాటో చిప్స్ ద్వారా ఒబిసిటీ ఖాయమని పరిశోధకులు కూడా తేల్చారు. అంతేగాకుండా ప్రోసెస్డ్ మాంసం, చక్కెర అధికంగా కలిగిన జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ వంటివి తీసుకుంటే డయాబెటిస్, హృద్రోగ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
పోషకాలు వుండవు.. 
నూనెల్లో వేపిన ఆహార పదార్థాల్లో ఎలాంటి పోషకాలు వుండవు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. నూనెల్లో వేపడం ద్వారా వాటిలోని పోషకాలు నశిస్తాయి. అందుకే నూనెతో తయారైన పదార్థాలను పక్కనబెట్టి, సలాడ్లు స్నాక్స్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
హైబీపీ తప్పదు
కరకరలాడే చిప్స్‌లో సోడియం అధిక మోతాదులో వుంటుంది. ఇవి హృద్రోగాలకు కారణమవుతాయి. అంతేగాకుండా హైబీపీకి దారితీస్తాయి. గుండెపోటు, కిడ్నీ సంబంధిత రోగాలు, డయాబెటిస్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
హై కొలెస్ట్రాల్ 
రోజూ పొటాటో చిప్స్ వంటి వాటిని తీసుకుంటే హై కొలెస్ట్రాల్ తప్పదు. డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఇంకా నూనెల్లో వేయించే వస్తువుల్లో ట్రాన్స్ ఫాట్స్ అధికంగా వుంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచేస్తాయి. అందుచేత చిప్స్‌ను స్నాక్స్‌గా తీసుకోకుండా.. ఉడికించిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. వీటిలో హై-సోడియం వుండదు. 
 
గోధుమలతో చేసిన వంటకాలు, మొక్కజొన్నతో చేసిన స్నాక్స్ వంటివి లో కెలోరీలను కలిగివుంటాయి. కూరగాయలతో చేసిన సలాడ్స్, సాండ్‌విజ్‌లు తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పాలిచ్చే తల్లుల్లో ఆ కోర్కెలు వుండవా?

పాలిచ్చే తల్లుల్లో లైంగిక వాంఛలు తక్కువగా వుండటానికి కారణాలను గైనకాలజిస్టులు ఇలా ...

news

అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే?

వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలా? అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలా? అయితే ఈ టిప్స్ ...

news

వెక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేస్తే సరి...

ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి ...

news

నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికీ ...

Widgets Magazine