ఆలివ్ నూనెను తీసుకుంటే? జ్ఞాపకశక్తికి?

గురువారం, 12 జులై 2018 (10:37 IST)

వయస్సు పెరిగే కొద్ది శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే. ఆ పరిణామాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన కొన్నింటి ఆధారంగా ఆ నియంత్రణను సాధించవచ్చును. మెదడు కణాల క్షీణతా వేగాన్ని తగ్గించే శక్తి ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంది. కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో సహాయపడుతుంది.
 
ఈ క్షీణతా వేగాన్ని తగ్గించడం ఆలివ్‌ నూనెతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా ఉండడానికి దాదాపు 60 శాతం ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ అవసరం. ఇవి ఆలివ్ నూనెలో సమృద్ధిగా ఉన్నాయి. గింజధాన్యాలు, అవకాడో, నువ్వులనూనెలోనూ ఈ ఫ్యాట్స్ ఉన్నాయి. కాకపోతే ఆలివ్ నూనెలోని ఫ్యాట్స్‌కు కణజాలాల్లోకి వెళ్లే శక్తి చాలా అధికంగా ఉంటుంది.
 
ఈ ఫ్యాట్స్‌కి మెదడు కణాల మెంబ్రేన్ దెబ్బ తినకుండా కాపాడేందుకు సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతినే పరిస్థితి నుండి ఈ ఫ్యాట్స్ బాగా రక్షిస్తాయి. మెదడులోని న్యూరాన్లను దెబ్బ తీయడం ద్వారా అల్జీమర్ వ్యాధి కారకమయ్యే హానికారక ప్రోటీన్స్ నుండి ఆలివ్ నూనెలోని ఆలియోకాంథల్ అనే మూలకం కాపాడుతుందని పరిశోధనలో తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

టైమ్ పాస్ కోసం తింటున్నారా..? ఐతే జాగ్రత్త సుమా..

టైమ్ పాస్ కోసం.. ఆకలేయకపోతున్నా.. సరదాగా స్నేహితులతో కలిసి తింటున్నారా..? అయితే అనారోగ్య ...

news

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...

రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో ...

news

వర్షాకాలంలో వేడివేడి బజ్జీలొద్దు.. నెయ్యిని పక్కనబెట్టేయాల్సిందే..

వర్షాకాలంలో దాహం వేయదు. చెమట పట్టదు. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా వుండదు. ...

news

పెళ్లి చేసుకుంటేనే మీ 'గుండె' పదిలం... లేదంటే?

పెళ్లి చేసుకుంటేనే మీ గుండె పదిలంగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. నాలుగు కాలాల పాటు ...