బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:57 IST)

అమ్మాయిలు కూడా బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోంది : మనోహర్ పారికర్

ఈ కాలపు అమ్మాయిలు బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అమ్మాయిలు కూడా బీర్ తాగడం ప్రారంభించడంతో నాకు

ఈ కాలపు అమ్మాయిలు బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అమ్మాయిలు కూడా బీర్ తాగడం ప్రారంభించడంతో నాకు భయమేస్తున్నది. సహనం పరిమితి దాటిపోతున్నది. నేను అందరి గురించి మాట్లాడడం లేదు. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారి గురించి కూడా మాట్లాడడంలేదు. 
 
అదేసమయంలో గోవాలో డ్రగ్స్ వ్యాపారం నివారణకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 170 మందిని అరెస్టుచేశాం. అంతమాత్రాన డ్రగ్స్ వ్యాపారం సున్నా శాతానికి చేరుకుంటుందని నేను నమ్మడంలేదు. తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్న వారికి చట్టం ప్రకారం 15 రోజులు లేదా నెలలోపు బెయిల్ లభిస్తుంది. కనీసం వారికి అపరాధభావం కలుగాలని పట్టుకుంటున్నట్టు ఆయన వివరించారు.