శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:40 IST)

ఉత్తరప్రదేశ్‌లో 40 మందికి హెచ్ఐవీ.. కారణమిదే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. ఏకంగా 40 మందికి హెచ్ఐవీ సోకింది. దీనికి కారణం ఇంజెక్షన్లు వేసేందుకు ఒకే సూదిని వినియోగించడమే. దీంతో 40 మంది రోగులు హెచ్ఐవీ బారినపడ్డారు. ఈ ఘరోం ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. ఏకంగా 40 మందికి హెచ్ఐవీ సోకింది. దీనికి కారణం ఇంజెక్షన్లు వేసేందుకు ఒకే సూదిని వినియోగించడమే. దీంతో 40 మంది రోగులు హెచ్ఐవీ బారినపడ్డారు. ఈ ఘరోం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లా పరిధిలోని బంగర్ మావ్ ప్రాంతంలో వెలుగు చూసింది. 
 
స్థానికంగా నడిచే ఓ క్లినిక్‌లో ఇంజక్షన్లు చేసేందుకు ఒకటే సూదిని వాడుతూ ఉండటంతో కనీసం 40 మంది హెచ్ఐవీ బారినపడ్డారు. గత సంవత్సరం చివర్లో ఈ ప్రాంతంలో ఓ హెల్త్ క్యాంప్ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సదరు క్లినిక్‌కు వెళ్లిన అందరి రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించారు. 
 
'దాదాపు 40 హెచ్ఐవీ కేసులు బయటకు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తే దాదాపు 500 మందికి ఈ వ్యాధి సోకినట్టు తేలవచ్చు. తమకున్న రోగాలను నయం చేసుకునేందుకు ఆసుపత్రికి వెళితే, అక్కడి డాక్టర్ ఒకే సిరంజిని అందరికీ వాడటమే దీనికి కారణం' అని బంగార్ మావ్ సిటీ కౌన్సిల్ సునీల్ చెప్పుకొచ్చారు. 
 
దీనిపై కూడా యూపీ ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నథ్ సింగ్ కూడా స్పందించారు. ఒకే సూదిని వాడటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. ఇప్పటికే వైద్యుల లైసెన్స్‌లను రద్దు చేశామని, విచారణ కొనసాగుతోందని, ఆసుపత్రికి వచ్చిన కొందరు ట్రక్ డ్రైవర్ల నుంచి వైరస్ వ్యాపించి ఉండవచ్చని, బాధ్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.