నెటిజన్లతో పాటు మీడియాపై సినీ నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా ఆమె పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన రెండో వివాహం గురించి మాట్లాడారు. అయితే, సమాజంలో అనేక అంశాలు వుంటే వాటన్నింటిని పక్కబెట్టి తన రెండో పెళ్లి వార్తనే హైలెట్ చేస్తూ వార్తలు రాయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి, రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు.