సంబంధిత వార్తలు
- Dream: శుభశకునాలను సూచించే కలలు ఇవే.. కలలో శ్రీలక్ష్మి కనిపిస్తే..?
- పదే పదే అప్పులు చేస్తే.. ఆ ఇంట లక్ష్మీదేవి వుండదట..
- మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే
- పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?
- చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?
11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?
Godess Lakshmi Puja
శుక్రవారం తులసి దళాలు తెంపకూడదు కాబట్టి ముందు రోజే సేకరించుకోవాలి. ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క తులసి దళం స్వామి పాదాల వద్ద ఉంచాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. శ్రీనివాసుని, శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన పొంగలి ప్రసాదాన్ని నివేదించాలి. ఇలా నియమానుసారంగా 11 శుక్రవారాలు పూజిస్తే దారిద్య్ర బాధలు, అప్పుల బాధలు తొలగిపోతాయి.
అమ్మవారి ప్రాణనాథుడైన స్వామివారిని పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం చేసే ఈ పూజతో ఇంట్లో, పని ప్రదేశంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలుంటాయి. సుఖమయ జీవితం చేకూరుతుంది. దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. ఇంకా ఉత్తర ఫాల్గుణి తిథి రోజున మహాలక్ష్మీ పూజ, కుమార స్వామి పూజ సర్వశుభాలను ప్రసాదిస్తుంది. అష్టైశ్వర్యాలను చేకూరుస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
