పదే పదే అప్పులు చేస్తే.. ఆ ఇంట లక్ష్మీదేవి వుండదట..
పదే పదే అప్పులు చేసే ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి వుండదట. అప్పులు తీస్తే.. ఆ ఇంట ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లోని దంపతులు జగడం వేసుకోవడం ద్వారా ఆ ఇంట లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే పౌర్ణమి, శుక్రవారాల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి కొలువై వుంటుంది. ఇంటిని శుభ్రంగా వుంచుకుంటే ఆ ఇంట దేవి కొలువై వుంటుంది. అరుపులున్న చోట, ఏడుపులు వున్న చోట.. శ్రీలక్ష్మీ కటాక్షం వుండదు.
శ్రీ లక్ష్మీకుబేర స్వామి ప్రతిమలను వుంచి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా రోజూ ఉదయం సాయంత్రం పూట దీపం వెలిగించడం మంచిది. ఇది లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. వారంలో ఒకరోజు, లేదా మాసంలో ఓ రోజు చేతనైనంత దానం చేయడంతో సంపదలు చేకూరుతాయి.
ఇంట ఆవులను పెంచడం ద్వారా, పెంపుడు జంతువులను పెంచడం ద్వారా ఇంట ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఇంట తులసీ మొక్కను పెంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంట పాజిటివ్ వైబ్ వుండేలా చూసుకోవాలి.
ఇంకా అశుభ వార్తలు పలకడం చేయకూడదు. సానుకూల దృక్పథాన్ని పెంచడం ద్వారా లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.