ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (16:22 IST)

లోన్ ఇబ్బందులున్నాయా.. వాయువ్య దిశలో అలా చేయకండి..

loan
ఇంట్లో పనికిరాని వస్తువులు ఆగ్నేయం దిశలో అస్సలు వుండకూడదు. అలా వుంటే ధననష్టం తప్పదు. ఆగ్నేయంలో డంపింగ్ యార్డ్ వుండటం.. చెత్తను చేర్చడం ద్వారా ఇతరుల చేతిలో మోసపోవడం జరుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఆగ్నేయంలో డార్క్ బ్లూ రంగులు, వైలెట్ రంగులను ఉపయోగిస్తే.. శీతల వ్యాధులు, ప్రమాదాలు జరిగే అవకాశం వుందని, అనవసరమైన ఖర్చులుంటాయి. బ్లూకలర్ వాటర్ ఎలిమెంట్ కావడంతో దానిని ఆగ్నేయంలో వాడటం మంచిది కాదు. 
 
ఎలక్ట్రిక్ వస్తువులు పాడైపోతాయి. అలాగే ఈశాన్యంలో పనికిరాని వస్తువులను వుంచితే.. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు, చీపుర్లు, ముగ్గుపిండి డబ్బాలు వుంచితే ఇంటి యజమానికి అనారోగ్యం తప్పదని వాస్తు నిపుణులు అంటున్నారు. కీళ్ళనొప్పులు వస్తాయి. ఆ ఇంట మగ సంతానానికి శ్వాస సంబంధిత రుగ్మతలు తలెత్తే ఆస్కారం వుంది. 
 
ధన నష్టం ఏర్పడుతుంది. ఆదాయం వుండదు. ఖర్చులు పెరిగిపోతాయి. ముఖ్యంగా  వాయువ్యంలో పనికిరాని వస్తువులు, సామాగ్రిని వుంచితే ఆ ఇంట నివసించే మహిళలకు మానసిక ఇబ్బందులు ఏర్పడుతాయి. ఏ దిశలోనైనా, ఇంట్లో అయినా పనికిరాని ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో నుంచి నేరుకు డస్ట్ బిన్‌లో పారేయడం మంచిది. 
 
ఇంట్లో ఉపయోగించని వస్తువులను అప్పుడప్పుడు తొలగిస్తేనే ఆ ఇంట వాస్తు దోషాలుండవని.. ఆర్థిక ఇబ్బందులు వుండవని వాస్తు నిపుణులు అంటున్నారు. ఉపయోగించని చెప్పులు వుండకూడదు. చెప్పులపై చెప్పులను వుంచడం మంచిది కాదు. 
 
తెగిపోయిన చెప్పుల్ని ఇంట్లో వుంచితే రాహు సంబంధించిన ఈతిబాధలు తప్పవు. అలాగే సాయంత్రం పూట బట్టలు ఉతకడం చేయకూడదు. ఇంట్లో పనికిరాని వస్తువులు వుంచకూడదు. ఏ దిశలోనూ అవి లేకుండా చూసుకోవాలి. 
 
ఆగ్నేయంలో పనికిరాని వస్తువులు లేకుంటే ధనాదాయం వుంటుంది. ఈశాన్యంలో శుభ్రంగా వుంటే.. పనికిరాని వస్తువులు అక్కడ వేయకుంటే ఆయురారోగ్యాలు చేకూరుతాయి. వాయువ్యం శుభ్రంగా వుంటే లోన్ సంబంధిత సమస్యలు వుండవు. ఇలా చేస్తే వాస్తు దోషాలు లేని సుఖమయ జీవితాన్ని జీవించవచ్చునని వాస్తు నిపుణులు సెలవిస్తున్నారు.