బుధవారం, 27 ఆగస్టు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 24 ఆగస్టు 2025 (14:42 IST)

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పబలంతో శ్రమించండి. మీ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. స్వయంకృషితోనే కార్యం సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. చేపట్టిన పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సన్నిహితులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పులు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దైవదర్శనం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్ధికంగా బాగుంటుంది. వాహనసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను తెలుసుకోండి. అనాలోచితంగా హామీలివ్వవద్దు. ఆత్మీయులను సంప్రదించండి. ఆదివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు స్వాగత, వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడే వారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. సోమవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సంకల్పబలమే విజయానికి తోడ్పడుతుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గురువారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అపరిచితవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతివిషయం స్వయంగా తెలుసుకోండి. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రముఖుల చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. మీ కష్టం ఫలిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. అనువ రానాలు, అపోహలకు తావ్వివద్దు. శుక్రవారం నాడు ఆచితూచి మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితులకు మీ సమస్యను తెలియజేయండి. ఒక ఆహ్వానం సంతోషం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ్రస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ తప్పులు సరిదిద్దుకోవటం ఉత్తమం. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు ముందుకు సాగవు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు, వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆశావహదృక్పధంతో ఉద్యోగయత్నం సాగించండి. ద్విచక్రవాహనదారులకు అత్యుత్సాహం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహనిర్మాణానికి ప్లాను మంజూరవుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. సాఫ్ట్వేర్ విద్యార్థులకు లాభసాటి అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. మంగళవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఔషధసేవనం క్రమం తప్పకుండా పాటించండి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తుల పనితీరు ప్రశంసనీయమవుతుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు కొంతమేరకు అనుకూలిస్తాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. మీ శక్తిసామర్ధ్యాలపై గురి కుదురుతుంది. మరింత ధైర్యంగా కొత్త యత్నాలు మొదలెడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. పట్టుదలతో మరోసారి ప్రయత్నించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధ, గురువారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్ధికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్థిరచరాస్తుల గురించి ఆలోచిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు ముందుకు సాగవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ముఖ్యం. ఏ విషయానికీ తీవ్రంగా స్పందించవద్దు. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పురస్కారయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శనివారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు సంతృప్తికరంగా సాగుతాయి.