మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు
ఉన్న బిడ్డలకే దిక్కులేదు కానీ ముగ్గురు పిల్లల్ని కనాలా? చంద్రబాబు గారి పాపులేషన్ పాలసి హాస్యాస్పదంగా వుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ట్యాక్సీ డ్రైవర్లుగానూ, ఆటోలు తోలుకుంటూ బ్రతుకీడుస్తున్నారు. ఇలాంటి స్థితిలో మీరిచ్చే బోడి 25 వేల రూపాయల కోసం మూడోబిడ్డను కనాలా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చలేకపోయారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు, జీతాలు ఇచ్చేందుకు కిందామీద పడుతున్నారు. ఇప్పటికే జగన్, మీరు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేట్లు చేసారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో రూ. 15 వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజల నెత్తిపై వేసారంటూ షర్మిల విమర్శించారు.