కన్యారాశికి కలిసొచ్చే రంగులు.. గుణాలు.. ఎరుపు రంగు మాత్రం?
కన్యారాశికి అనుకూలించే రంగుల గురించి వారి గుణాలను గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. కన్యారాశి కాలపురుషుడికి ఆరో రాశిగా పరిగణింపబడుతుంది. కన్యారాశికి గులాబీ రంగు బాగా కలిసివస్తుంది. ఈ రంగు ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది.
కన్యారాశికి ధనాధిపతిగా తులారాశిగానూ, భాగ్యాధిపతిగా వృషభం వుంటుంది. వీటి అధిపతి శుక్రుడు. వీరు ధనాదాయాన్ని చేకూర్చేందుకు ఈ రాశి వారికి అనుకూలిస్తారు. అందుకే ఈ రాశి జాతకులు పింక్ రంగులను వాడటం మంచిది. ఇవి న్యాయమైన ఫలితాలను ఇస్తుంది. కన్యారాశికి నాలుగో అధిపతిగా ధనస్సు, ఏడో స్థానంలో మీనరాశి వుండటంతో పసుపు రంగును కూడా వాడవచ్చు. వ్యాపార స్థలాల్లో పసుపు రంగును ఉపయోగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కన్యారాశికి మూడు, ఎనిమిది స్థానాల్లో వృశ్చికం, మేషరాశి వుండటం.. వీటికి కుజుడు అధిపతి కావడంతో ఎరుపు రంగును ఉపయోగించకపోవడమే మంచిది. ఈ రాశి వారు మనఃకారకుడైన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
పౌర్ణమి రోజున అమ్మవారిని ప్రార్థించడం శుభఫలితాలు చేకూరుతాయి. అలాగే సోమవారం, పౌర్ణమి రోజుల్లో తెలుపు రంగు దుస్తులను వాడటం మంచిది. ఇంకా ఆరెంజ్ రంగును వాడటం ద్వారా మధ్యస్థ ఫలితాలను పొందవచ్చు.
సిద్ధుల ఆలయాలకు వెళ్లే సమయంలో, విదేశాలకు వెళ్లేటప్పుడు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు, శుభ ఖర్చులు చేసేటప్పుడు ఆరెంజ్ రంగును వాడటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.