1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Acid rain falling over Iran: People are suffering from headaches, breathing problems

ఇరాన్ పైన కురుస్తున్న ఆమ్లవర్షం: తలనొప్పి, శ్వాస సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Acid rain on Iran
ఇరాన్ దేశం పైన నల్లటి ఆమ్లవర్షం కురుస్తోంది. ఈ వర్షం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అక్కడి వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సేనలు ఇరాన్ లోని చమురు బావులపై దాడులు చేసిన నేపధ్యంలో ఈ పరిస్థితి నెలకొన్నది పలువురు చెబుతున్నారు. చమురు బావులకు నిప్పు అంటుకుని అక్కడ భారీగా నల్లని పొగ కమ్ముకున్నదనీ, వర్షం పడుతుండటంతో అది కాస్తా దానితో కలిసి ఇలా ఆమ్ల వర్షం కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఆమ్ల వర్షం కారణంగా ప్రజలకు అనారోగ్య సమస్యలు పట్టుకుంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇరాన్ దేశంపై దాడి చేసి భారీ విధ్వంసం
ఇరాన్ దేశానికి అమెరికా దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ హెచ్చరిక చేసాడు. ఆ దేశంపై భీకర దాడులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫైటర్ జెట్స్, బాంబర్స్, ఇరాన్ లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఖచ్చితత్వంతో కూడిన భారీ క్షిపణులు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ అమెరికా పూర్తి శక్తిని ఉపయోగించలేదనీ, ఈరోజు మొదటిసారిగా అమెరికా శక్తి ఏమిటో ఇరాన్ చూస్తుందన్నారు.
 
ఆ దేశం అణుబాంబులు తయారుచేయకుండా చూడటమే తమ బాధ్యతనీ, అందుకుగాను అక్కడ వున్న అణుకేంద్రాల కోసం యత్నిస్తున్న ప్రాంతాలన్నిటినీ మసి చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ దేశంలోని క్షిపణి నిల్వ కేంద్రాలు, లాంఛర్లను తుడిచిపెట్టబోతున్నట్లు తెలియజేసారు. రక్షణ వ్యవస్థను నాశనం చేస్తామన్నారు. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేస్తూ చమురు సరఫరాకి అడ్డంకి కలిగిస్తూ హర్మూజ్ జలసంధిని మూసివేస్తే మటుకు ఇరాన్ తీవ్రమైన ఫలితాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
 
ఇరాన్ ఆ పని చేయడం మానుకోకపోతే ఇప్పుడు చేసిన దాడుల కంటే 20 రెట్లు ఎక్కువ శక్తితో వారిపై దాడులు చేస్తామని అన్నారు. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ మాట్లాడుతూ... ఎంతో పురాతన నాగరికత వున్న ఇరాన్ దేశాన్ని ఈ భూగోళం పైన వున్న ఎవ్వరూ నాశనం చేయలేరంటూ మరింత రెచ్చగొట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
జర్మన్ డిజైన్ అవార్డు 2026లో V-గార్డ్ లక్స్‌క్యూబ్ వాటర్ హీటర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు