గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (10:44 IST)

ఉసిరికాయ చెట్టును ఇంట్లో పెంచినట్లైతే..?

వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరికాయ చెట్టును పెంచడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే లక్ష్మి అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు విష్ణుమూర్తి అంశ కావడంతో ఉసిరి చెట్టులో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అంతే కాకుండా ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.  
 
ఇంకా ఉసిరి చెట్టు లక్ష్మీ కుబేరుల వృక్షం కావడంతో భక్తులు ఉసిరి చెట్టును ఇంట్లో పెంచుకుంటారు. దాంతో పాటు దేవతా అనుగ్రహం కూడా పెరుగుతుంది. ఈ ఉసిరి చెట్టుకు దైవిక శక్తి ఉండడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రవేశించదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.