భాగ్యనగరిలో వీధి కుక్కల స్వైర విహారం - 16 మందిపై దాడి
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు స్వైర వివాహం చేస్తున్నాయి. ఇటీవలే ఈ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని సుమోటాగా కేసు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో భాగ్యనగరిలో వీధి కుక్కలు మరోమారు స్వైర వివాహం చేశాయి. హైదరాబాద్ బాలానగర్ పరిధి వినాయక్‌నగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క ఎగబడుతూ కరిచింది.
గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి జోన్ డాగ్ స్వ్కాడ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.