1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Naveen murder: Cops may probe 2 more contacts of Krishna

నవీన్ హత్య కేసు.. షాకింగ్ నిజాలు.. చేతి గ్లౌజ్‌లు ధరించి.. కత్తితో..?

crime scene
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కలిసిమెలసి తిరిగిన స్నేహితుడిని చంపేందుకు హరిహర కృష్ణ ఎలాంటి ప్లాన్ చేశాడనే దానికి జరిగిన దర్యాప్తులో విస్మయం గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు స్నేహితుడు నవీన్‌తో హరి చాలా మంచివాడిగా నటించాడని.. అతనితో కలిసి హ్యాపీగా తిరిగాడని పోలీసులు తెలిపారు. 
 
ఉప్పల్‌ మాల్‌లోని థియేటర్‌లో హాలీవుడ్ సినిమా చూశారని.. తర్వాత నాగోల్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ నుంచి ఫ్రెండ్స్‌తో నవీన్‌ను తన సోదరి ఇంటికి చేరాడు. అయితే ఫోన్ రావడంతో నవీన్ చైతన్యపురికి వెళ్లాడు. ఆతడి స్నేహితురాలికి సెల్ ఫోన్ కొనిచ్చాడు. 
 
ఆపై రాత్రి ఎంజీ వర్శిటీ వసతి గృహానికి వెళతానని నవీన్ చెప్పాడు. ఇదే అదనుగా హరి అతడిని నమ్మించి తీసుకెళ్లాడు. అప్పటికే కత్తి, చేతి గ్లౌజ్‌లు భద్రపరిచిన బ్యాగ్‌ను తీసుకుని అతడితో కలిసి బయల్దేరాడు. నవీన్‌తో మద్యం తాగించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశాడు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను.. తీసుకోండి..