శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (08:30 IST)

మనీష్ సిసోడియాకు ఏడు రోజుల కస్టడీ.. తీహార్ జైలుకు తరలింపు

Manish Sisodia
న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ కోర్టు ఏడు రోజుల ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీ విధించింది. మద్యం పాలసీని ఉల్లంఘించారనే ఫిర్యాదుపై సీబీఐ 26వ తేదీన న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం అతడిని సీబీఐ కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. తదనంతరం, సిసోడియాను మరో రెండు రోజులు (మార్చి 6 వరకు) రిమాండ్ చేసేందుకు కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. 
 
సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 6న ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ సిసోడియాను హాజరుపరిచింది. ఈ కేసును విచారించిన కోర్టు సిసోడియాను మార్చి 20 వరకు తీహార్ జైలులో ఉంచాలని ఆదేశించింది.
 
ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ ప్రత్యేక కోర్టులో విచారణకు రాగా, ఆయనకు బెయిల్ వచ్చినా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అతన్ని అరెస్టు చేయవచ్చని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో మద్యం పాలసీ ఉల్లంఘన కేసులో అరెస్టయిన మనీస్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 7 రోజుల రిమాండ్‌కు తరలించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మద్యం అవినీతి కేసులో అక్రమ నగదు బదిలీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.