శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2025 (16:51 IST)

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Dil Raju, Director C. Umamaheswara Rao,  Priyanka
Dil Raju, Director C. Umamaheswara Rao, Priyanka
ఎప్పటినుంచో నవంబర్ 14 జరగబోయే అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్ అనేది కొద్దికాలంగా రాజకీయ కారణాలతో బ్రేక్ పడింది. ఈ విషయం గురించి ఇటీవలే తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు ద్రుష్టికి తేగా త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని తెలిపారు. ఈరోజు ఎఫ్.డి.సి. కార్యాలయంలో జరిగిన సమావేశంలో దిల్ రాజు, సీనియర్ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు పాల్గొని పలు విషయాలు తెలియజేశారు.
 
HISFF . IN  వెబ్ సైట్ ప్రారంభం జరిగింది. దిల్ రాజు మాట్లాడుతూ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభం ఈరోజు చేశాం.  ఎఫ్ డీ సి ఎం డీ ప్రియాంక తో కలిసి వెబ్ సైట్ ను ప్రారంభించాం. అదేవిధంగా  డిసెంబర్ 19-20-21 మూడు రోజుల పాటు హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది అన్నారు.
 
ఈ వేడుకలో ఐమాక్స్ థియేటర్ లో షార్ట్ ఫిలిం వేడుక జరుగుతుంది. 3 సెకండ్ల నుంచి 25 నిమిషాల పాటు నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ పంపాలి. వాటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లోనే అప్ లోడ్ చేయాలి, దీనికి ఇంటర్నేషనల్ స్థాయి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల హాజరుకానున్నారు. ఫెస్టివల్ చివరి రోజున ముఖ్యమంత్రిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నాము అన్నారు దిల్ రాజు. 
 
మరో విశేషం ఏమంటే, వచ్చే ఏడాది నవంబర్ 14 నాటికి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు కృషీ చేస్తామని ప్రకటించారు.