చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?
మార్కెట్లోకి చిక్కుడు కాయలు వచ్చేసాయి. వీటిని తింటుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చిక్కుడు కాయ గింజలలో వుండే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. వీటిల్లో శరీర నిర్మాణం, కండర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అవసరమైనంత వుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, మలబద్ధకం సమస్యను లేకుండా చేస్తాయి. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి వీటిని తింటుంటే శరీరానికి ఐరన్ అందుతుంది. ఎముక పుష్టికి, నాడీ వ్యవస్థకు, కండరాల బలానికి ఇందులోని మెగ్నీషియం దోహదం చేస్తుంది.
అలాగే చిక్కుళ్లలోని ఫాస్పరస్ దంతాలు పటిష్టంగా వుండటానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యానికి సాయపడే పొటాషియం కూడా ఇందులో లభిస్తుంది. చిక్కుడు గింజల్లో వుండే జింక్ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మెదడు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.