శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 నవంబరు 2025 (18:37 IST)

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Kajal Agarwal
Kajal Agarwal
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో వుంది. టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సినిమా షూటింగ్‌ల నుండి కాస్త విరామం తీసుకుని, సెలవులను ఆస్వాదిస్తోంది. ఆమె ఇటీవల తన భర్త గౌతమ్ కిచ్‌లుతో కలిసి ఆస్ట్రేలియాలోని సుందరమైన యారా వ్యాలీకి వెళ్లింది. 
 
కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రిప్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసి అభిమానులు సూపర్, నైస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోల్లో టాలీవుడ్ చందమామ చాలా అందంగా కనిపిస్తుంది. 
Kajal Agarwal
Kajal Agarwal


సహజంగా నవ్వుతూ, సూర్యకాంతిలో మెరుస్తూ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. భర్త గౌతమ్‌తో కలిసి కాజల్ తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
Kajal Agarwal
Kajal Agarwal
 
ఇకపోతే.. కాజల్ సినిమాల సంగతికి వస్తే.. భగవంత్ కేసరి సినిమా ద్వారా కాజల్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఆమె కొన్ని స్క్రిప్టులు వింటున్నారు. 
Kajal Agarwal



ఈ వెకేషన్ పూర్తయ్యాక ఆమె కొత్త ప్రాజెక్టులో సంతకం చేసే అవకాశం వుందని టాక్ వస్తోంది.