Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు
మంచు విష్ణు నటించిన కన్నప్ప రేపు విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సినిమా విశేషాలను తెలియజేస్తూ, ఇప్పటి జనరేషన్ కు తెలీని కథను చెబుతున్నాను అన్నారు. కానీ కన్నప్ప అనేది నాట్ మైథలాజికల్. కల్పితం (మంచు పురాణం). చివరిలో మాత్రం ఒరిజినల్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతకు ముందు మాట్లాడుతూ, కన్నప్ప అనేది ఇంతకుముందు ఎవరూ చూపించని పాయింట్ ను మా సినిమాలో చూపించాను అన్నారు.
అయితే, కన్నప్ప శివలింగం పైన కాలుపెట్టడం, నోటితో నీళ్ళు పోయడం అనేది ఉత్తరాదిలో సహించదు అన్నారు. కానీ కథను కథగా చెప్పాలని నేను డేర్ చేశాను. మన దక్షిణాదిలో కన్నప్ప కథ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో కథ పూర్తిగా మన స్థాయిలో వుండకపోవచ్చు.
సినిమా సెన్సార్ అయ్యాక 9మంది మేథావులు తిలకించారు. అందులో బ్రాహ్మణులు వున్నారు. మా దర్శకుడు బ్రాహ్మణుడే. వారికి లేని బాధ ఏదో ప్రయోజనం కోసం కొందరు రాద్దాంతం చేశారని అన్నారు.
24 గంటల్లో లక్ష పైగా టికెట్లు అమ్ముడు పోవడం కూడా శివాజ్న గానే భావిస్తున్నా. క్రిష్ణంరాజు గారు భక్తకన్నప్ప చేశారు. ఆయన వారసులు ప్రభాస్ ఇందులో భాగం కావడం అద్రుష్టంగా భావిస్తున్నాను.