1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 18 జులై 2025 (19:26 IST)

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

Venu Swami Pooja with Nidhi Agarwal
Venu Swami Pooja with Nidhi Agarwal
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'హరి హర వీరమల్లు' లో  నిధి అగర్వాల్ రాణి పాత్రలో నటించింది. మరో వైపు ప్రభాస్ తో రాజా సాబ్ లోనూ నటిస్తోంది. కాగా, ఇటీవలే సినిమావారికి జాతకాలు చూసే వేణు స్వామి చేత పూజలు చేయించుకుంటున్న ఫొటోలను వేణు స్వామి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి క్రేజ్ ను సంతరించుకున్నాయి. అయితే ఈ పూజల్లో నిజమెంత? అసలు ఆమె ఎందుకు ఈ పూజలు, హోమాలు చేసిందో తెలియాలంటే ఆమెతో జరిపిన చిన్న చిట్ ఛాట్ తో తెలుసుకుందాం. వెబ్ దునియాకు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఆమె మనసు విప్పి మాట్లాడింది.
 
నిధి అగర్వాల్ మాట్లాడుతూ, వేణు స్వామితో పూజలు చేయించాం. అయితే అవి హరిహరవీరమల్లు కు ముందు చేయించవి. ఓ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఆయన్ను సంప్రదించాం.  జాతకాలలో ఏమైనా దోషాలుంటే ఇలాంటి చేస్తారని తెలిసింది. అందుకే ముంబై రప్పించి మా ఇంటిలోనే హోమాలు, పూజలు చేయించడం జరిగింది. మా కుటుంబసభ్యులందరూ అందులో పాల్గొన్నారు అని చెప్పారు.
 
కెరీర్ పరంగా బాగుంటుందని చేయించుకన్నారంటే... కెరీర్ అనికాదు. నేను పుట్టిన సమయంలో చిన్నపాటి దోషాలుండడంతో అలా చేయాల్సివచ్చింది. అయితే వయస్సుపెరిగే కొద్దీ కొన్ని రాశులు, నక్ష్రతాలు కూడా తగి తప్పుతాయి. కనుక అలాంటి టైంలో కొంచెం జాగ్రత్తపడాలని పెద్దలు చెప్పారు. పైగా ఈ ఏడాది అష్టగ్రహ కూటమి రావడంతో కొన్ని రాశులవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనడంతో నేను కూడా ఇలా చేయాల్సివచ్చింది.
 
వేణు స్వామితో పూజలు తర్వాత ఎలా వుంది అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటివరకు మామూలుగానే వుంది. ఏదైనా కర్మను బట్టే ఫలితాలు వుంటాయి. అలా అని మనం ఊరికో కూర్చోకూడదు. ఏదో ఒక పనిచేస్తూ ఫలితం ఆశించకుండా  పూజలు చేయాలి. అలా చేసిందే ఈ పూజ. ఇలాంటి పూజలు చేశాక ఫలితం  వెంటనే కనిపించదు. నిదానంగా కనిపిస్తుందని వేణుస్వామి గారే చెప్పారంటూ తన మనసులోని మాటను పంచుకుంది.