మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జులై 2025 (21:43 IST)

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

harihara veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం నుంచి అభిమానులకు రెండు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనుంది. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, మూవీ మేకింగ్ వీడియో, ఓ పవర్‌ఫుల్ సాంగ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, "తార తార", "ఎవరది ఎవరది" తదితర పాటలు ప్రేక్షకులను ఆలరిస్తున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు చిత్రానికి "యూఏ సర్టిఫికేట్" మజూరు చేసింది. ఈ చిత్రం రన్ టైమ్ కూడా 2 గంటల 42 నిమిషాలుగా ఉంది. మరోవైపు, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఈ నెల 20వ తేదీన విశాఖపట్టణంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.