గురువారం, 6 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 6 నవంబరు 2025 (17:44 IST)

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Thiruveer, Tina Sravya
Thiruveer, Tina Sravya
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 7 న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.
 
హీరో తిరువీర్ మాట్లాడుతూ .. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. ‘జార్జి రెడ్డి’, ‘మసూద’ కూడా ఇదే నెలలో రిలీజ్ అయ్యాయి. విలన్ నుంచి కో ప్రొడ్యూస్ చేసే స్థాయికి నేను ఎదిగాను. ఇచ్చిన ప్రేమ, సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది. కథ మీద, సినిమా వచ్చిన తీరు మీదున్న నమ్మకం, ధైర్యంతోనే రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశాం. అలా నమ్మకంతో వేసిన ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మూవీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ పాజిటివ్ టాక్‌ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాం. చెప్పింది చెప్పినట్టుగా తీసి రాహుల్ విజయం సాధించారు. సురేష్ గారి మ్యూజిక్ ఈ మూవీకి ప్రాణంగా నిలిచింది. మంచి చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. నవంబర్ 7న వస్తున్న చిత్రాలన్నీ పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
 
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘గత ఏడాది నవంబర్ 7న ఫస్ట్ షాట్ చిత్రీకరించాం. ఇప్పుడు నవంబర్ 7న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఈ ఏడాదిలో టీం అంతా కలిసి ఫ్యామిలీలా పని చేశాం. గత రెండు నెలలుగా నేను చాలా టెన్షన్ పడ్డాను. భారీ ఓపెనింగ్స్ రావు.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన రావడం, మీడియా, ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆనందంగా అనిపించింది. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకు ఆడియెన్స్ పెట్టే ఖర్చుకు ఏ మాత్రం నిరాశచెందరు. ఈ మూవీని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో కలిసి చూస్తే మరింతగా నచ్చుతుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన తిరువీర్ గారికి, నిర్మాతలకు, నా టీంకి థాంక్స్’ అని అన్నారు.
 
నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. ఈ కథే మా అందరినీ వెతుక్కుంటూ వచ్చింది. నాకు ఏ మాత్రం కష్టం తెలియకుండా ఈ మూవీని రాహుల్, తిరువీర్ భుజానికి ఎత్తుకున్నారు. నేను చేసే ప్రతీ సినిమాకు సురేష్ బొబ్బిలి అన్ననే తీసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.
 
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .తిరువీర్ గారి సహకారం నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ మూవీలో నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సురేష్ గారి పాటలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది.’ అని అన్నారు.
 
సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తిరువీర్ అన్నకు థాంక్స్. ఆయన ఎంతో సహజంగా నటిస్తారు. ఇలానే కొత్త వారికి అవకాశాలు ఇస్తూ మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. టీనా, నరేంద్ర, యామినీ, రోహన్ ఇలా అందరూ అద్బుతంగా నటించారు. రాహుల్ అద్భుతమైన దర్శకుడు. ఒక చిన్న పాయింట్ పట్టుకుని సినిమాని గొప్పగా తీశారు’ అని అన్నారు.
 
మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్ చూసి అభినందించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఈ మూవీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాహుల్ అన్నకి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన తిరువీర్ అన్నకి థాంక్స్ అని అన్నారు.