The Great Pre Wedding Show new poster
నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫి: సోమశేఖర్, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్, నిర్మాత: అగరం సందీప్, సహ నిర్మాత: కల్పనా రావు, బ్యానర్: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్. విడుదల: శుక్రవారం నవంబర్ 7,2025
కథ:
రమేష్ (తిరువీర్) శ్రీకాకుళంలోని ఓ గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. ఊర్లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు ఫోటోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో పంచాయితీ ఆఫీసులో పనిచేసే హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమిస్తాడు. ఇదిలా వుండగా, ఆ ఊరిలో పలుకుబడి వున్న ఆనంద్‌కి సౌందర్య తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా నూ మండలంలో పెద్ద పేరు కోసమని గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని రమేష్ కు పని అప్పగిస్తాడు ఆనంద్.
ఫొటో షూట్ బ్రహ్మాండంగా రమేష్ చేసి కెమెరాలో బంధిస్తాడు. కెమెరాలోని చిప్ ను ఇవ్వాలనుకుని చూస్తే అది కనిపించదు. దాంతో పెండ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత రమేష్ తన ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తాడు. అది పెద్దలు ఒప్పుకోరు. అసలు రమేష్ కెమెరాలో చిప్ ఎలా పోయింది? దీని వెనుక కుట్ర ఏమిటి? రమేష్ ప్రేమించే హేమ లవ్ స్టోరీ ఏమైంది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
సమీక్ష:
ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు రాసుకున్న కథ. పట్టణాలనుంచి రూరల్ కూ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కామన్ అయింది. అక్కడ ఇలా చేస్తుండగా ఏమి జరిగింది? అనే పాయింట్ దర్శకుడు చాలా ఆసక్తిగా మలిచాడనే చెప్పాలి. పాత కొత్త కలయికతో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. ఇందులో నటుడు తిరువీర్ పాత్రకు అతికినట్లుగా వున్నాడు. చాలా సింపుల్, కామన్ మ్యాన్ క్యారెక్టర్‌ని పోలిన విలేజ్ ఫోటోగ్రాఫర్ రోల్‌లో తిరువీర్ నటన, ఈ మూవీకి ప్రధానమైన ప్లస్ పాయింట్. హీరోయిన్ టీనా శ్రావ్య అందంగా ఉంది. పెళ్లి కొడుకుగా నటించిన నరేంద్ర రవి, పెళ్లి కూతురు యామిని, ఛైల్డ్ ఆర్టిస్ట్ రోహాన్ రాయ్ కూడా ఎంటర్ టైన్ చేశారు.
పల్లెటూరులో జరిగే కథను అందంగా తీయాలంటే సినిమాటోగ్రఫీ ముఖ్యం. దానిని సోమశేఖర్ బాగా బంధించాడు. ఇక సురేష్ బొబ్బిలి సమకూర్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి. సహజంగా విలేజ్ కథలంటే కొన్ని మాండలికాలు, ద్వందార్థాలుంటాయి. వాటి జోలికి పోకుండా దర్శకుడు డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ క్లీన్‌గా తెరపైకి తీసుకొచ్చాడు. డైలాగులు చాలా బాగా పేలాయి. చాలా చిన్న కథ కావడంతో సెకండాఫ్‌లో కొంత సాగుతున్న ఫీల్ కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి కామెడీ, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
ఎటువంటి హంగూ ఆర్భాలు లేకుండా సింపుల్ కథను అంతే సింపుల్ గా చెప్పిన విధానం బాగుంది. దాన్ని నిర్మించిన నిర్మాతలకు మంచి అభిరుచి వుందని అర్థమవుతుంది. క్లీన్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. ఇది కుటుంబంతో హాయిగా కలిసి చూడతగ్గ చిత్రంగా చెప్పవచ్చు.
రేటింగ్ : 3/5