గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (08:18 IST)

నాన్నమ్మ మెడలో చైన్ దోపీడీ- స్నాచర్‌పై బాలిక దాడి.. వీడియో

Chain snatching
మహారాష్ట్రలోని పూణె సిటీలో తన నాన్నమ్మ మెడలోని గొలుసును దొంగిలించే ప్రయత్నాన్ని 10 ఏళ్ల బాలిక ధైర్యంగా అడ్డుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
వృద్ధురాలు ఇద్దరు పిల్లలతో కలిసి నివాస ప్రాంతంలోని నిశ్శబ్ద రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా, స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది. 
 
అయితే, వెంటనే వృద్ధురాలి మనవరాలు తన వద్ద ఉన్న బ్యాగ్‌తో దొంగపై దాడి చేసింది. ఈ సంఘటన ఫిబ్రవరి 25న జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 9న పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేశారు. 
 
నాన్నమ్మను కాపాడేందుకు నేరస్తుడితో బాలిక ధైర్యంతో పోరాడిందని పోలీసులు, నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేరానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చిన్నపిల్లలు కూడా మార్పు తీసుకురాగలరని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.