గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (14:45 IST)

శిథిలాల కింద 125 గంటల పాటు సజీవంగా ఉన్న 2 నెలల చిన్నారి

two months old baby
టర్కీ, సిరియా దేశాల్లో మారణహోమం సృష్టించిన వరుస భూకంపాలు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ భూకంపం ధాటికి కూలిపోయిన శిథిలాల నుంచి తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 28 వేల మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మరణాల్లో టర్కీలో 25 వేల మంది, సిరియాలో 3500 మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భూకంపం సంభించి రోజులు గడిచిపోతున్నప్పటి కొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉడటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. 
 
హతెయ్ ప్రాంతంలో శనివారం శిథిలాల కింద చిక్కుకున్న రెండేళు నెలల చిన్నారిని సహాయ బృందాలు ప్రాణాలతో వెలికి తీశారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు. 
 
టర్కీ మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించి ఐదు రోజుల కావస్తున్నా కొందరు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను రక్షించగలిగారు. అంతేకాకుండా.. ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు.