గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (08:59 IST)

టర్కీ - సిరియా భూకంపాల్లో మృతులు 3800 వేలకు పైమాటే...

turkey earthquake
టర్కీ, సిరియా దేశాల్లో అపార ప్రాణనష్టం సంభవించింది. సోమవారం సంభవించిన మూడు భూకంపాల కారణంగా ఏకంగా 3800 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. వరుస భూకంపాలతో టర్కీ చిగురుటాకులా వణికిపోయింది. సిరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శిథిలాల కింద చిక్కుకున్న అనేక మంది ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆ దేశంలోని అన్ని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. అనేక మందికి రోడ్డుపైనే చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద క్కుకున్న అనేక మందిని సహాయక సిబ్బంది రక్షిస్తున్నారు. 
 
సోమవారం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైన భూకంపం తర్వాత అనేక వరుస భూకంపాలు సంభవించాయి. ఫలితంగా టర్కీ, సిరియా దేశాలు వణికిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రులన్నీ బాధితులతో కిక్కిరిసి పోయాయి. శిథిలాల కింద నలిగిపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. ఆ ప్రాంతాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. 
 
ఎపుడు ఎలాంటి ముప్పు ముంచు కొస్తుందో తెలియని భయాందోళనలో టర్కీ ప్రజలు బతుకు జీవుండా అంటూ బిక్కుబిక్కు మటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ వరుస భూకంపాల ధాటికి ఒక్క టర్కీలోన దాదాపు 15 వేల మంది వరకు గాయపడ్డారు. వీరిలో సాధ్యమైనంత మందిని సహాయక సిబ్బంది రక్షిస్తున్నారు. చాలామంది స్థానికంగా ఉండే మసీదుల్లోనే తలదాచుకుంటున్నారు. 
 
8వించిన భూకంపం కారణంగా 550 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది వరకు గాయపడ్డారు. అలాగే, తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 400 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.