గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (13:18 IST)

యూఎఫ్ఓ ఆకారంలో భారీ మేఘం.. సోషల్ మీడియాలో వైరల్

turkey cloud
turkey cloud
జనవరి 19న, టర్కీలోని బుర్సా మీదుగా ఆకాశంలో యూఎఫ్ఓ ఆకారంలో ఉన్న భారీ మేఘం కనిపించింది. విశ్వానికి ఒక ఫ్లయింగ్ సాసర్ లేదా పోర్టల్‌ను పోలిన క్లౌడ్, చాలామంది పౌరుల దృష్టిని ఆకర్షించింది. ఇంకా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మేఘానికి  చెందిన అసాధారణ ఆకారం, ప్రదర్శన వింతగా అనిపించినప్పటికీ, ఇది లెంటిక్యులర్ క్లౌడ్ అని పిలువబడింది. తేమతో కూడిన గాలి పర్వతం లేదా శిఖరంపై ప్రవహించినప్పుడు ఈ మేఘాలు సాధారణంగా ఏర్పడతాయి.
 
దీనివలన గాలి చల్లబడి లెన్స్ ఆకారపు మేఘంగా ఘనీభవిస్తుంది. ఇవి తరచుగా పర్వత శిఖరాలు, శిఖరాల దగ్గర కనిపిస్తాయి. లెంటిక్యులర్ మేఘం కనిపించడం అసాధారణమైనది.