శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (11:34 IST)

టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృత్యువాత

istambul bomb blast
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. నిత్యం జన సంచారంతో అత్యంత రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్ ఎవెన్యూలో ఈ బాంబు దాడి జరిగింది. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 80మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో పది మంది వరకు చనిపోయినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. 
 
ఇస్తాంబుల్ మార్కెట్‌ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి వస్తువులు పేలుడు ధాటికి గాల్లో ఎగిరి చిందరవందగా పడిపోయాయి. ఇందుకు సంభంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి.