మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:49 IST)

టర్కీలో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.8 తీవ్రతగా నమోదు

turkey earthquake
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో దక్షిణ టర్కీలోని నూర్దగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైవుందని జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెన్స్ తెలిపింది. భూకంప కేంద్రాన్ని నుర్దగీ పట్టణానికి 7 కిలోమీటర్లదూరంలో గుర్తించారు. 
 
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావం సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, భూకంప ప్రభావంతో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. అయితే, ఈ భూకంపం ప్రభావం కారణంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా అందుతున్న సమాచారం అలాగే, 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి.