ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:46 IST)

ట‌ర్కీలో నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పిన నిజం

turky balayya
turky balayya
నందమూరి బాలకృష్ణ ఏది చెప్పినా, చేసినా డైరెక్ట్ వ‌ర్ష‌నే. తాజాగా ఆయ‌న దర్శకుడు గోపీచంద్ మలినేని తో 107వ మూవీలో హీరోగా చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల విడుదలై అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
 
ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా అక్కడ కొన్నాళ్లపాటు భారీ షెడ్యూల్ జరగనుండగా మరికొన్నాళ్లు అక్కడే బస చేయనుంది యూనిట్. కాగా నిన్న అక్కడి ఓ రెస్టారెంట్ లో ఒక కుటుంబంతో కలిసి టిఫిన్ చేసిన బాలకృష్ణ, అక్క‌డ తాను ఫుడ్ తిన్నాక టాబ్‌లెట్లు వేసుకుంటున్నాని అంటూ అక్క‌డి వారితో చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అదేవిధంగా అక్క‌డ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి  మహిళని చూస్తూ  ఎక్కువగా ధారావాహికలు చూస్తూ మెదడు పాడుచేసుకుంటుంటారు, నేను టీవీలు పెద్ద‌గా చూడ‌ను.  టివి చూడడం ఎంత తగ్గిస్తే మెదడుకి అంత మంచిదని భావిస్తాను అంటూ ఆయన సరదాగా మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయ‌న‌తోపాటు కూర్చున వ్య‌క్తి దీన్ని షూట్ చేసి పెట్టారు.