బింబిసార తిలకించిన బాలకృష్ణ
Nandamuri Balakrishna, Kalyan Ram
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో తిలకించారు. తనకుటుంబసభ్యులతోపాటు కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ కూడా ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, బింబిసార చక్రవర్తి కథను నేటి యుగానికి సంబంధించిన అంశాన్ని మిళితం చేసిన దర్శకుడు వశిష్ట్ అద్భుతంగా చిత్రించారు. రెండు షేడ్స్‌లోనూ కళ్యాణ్ రామ్ చక్కటి నటన ప్రదర్శించాడని కొనియాడారు.
ఇప్పటికే ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. విడుదల తర్వాత ఎన్.టి.ఆర్. జూనియర్ కూడా సినిమా ఆసక్తికరంగా వుందని కామెంట్ చేశారు.చిత్రపరిశ్రమలోని పలువురు బింబిసార కొత్త ప్రయోగమని, కళ్యాణ్ రామ్‌కు ఇటువంటి ప్రయోగాలు చేయడం ఇష్టమని పేర్కొన్నారు.