1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Roja fires on Chandra Babu Naidu Nagari visit

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

RK Roja
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని రోజా వెల్లడించారు.నగరిలో చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రోజా మండిపడ్డారు.
 
నగరిలో కల్యాణమండపం, సబ్‌స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల, పార్కు, షాదీ మహల్ వంటి అభివృద్ధి పనులన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని రోజా తెలిపారు. పేదలకు ఇళ్ల మంజూరు సహా అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వమే అందించిందని చెప్పారు.
 
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర, అరాచక ఆంధ్రగా మార్చేశారంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాలుగుసార్లు సీఎం అయినా నగరికి ఏమీ చేయలేదని, గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన అభివృద్ధి కూడా శూన్యమేనని విమర్శించారు.
 
 
వైసీపీ పాలనలో వందల కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. పవర్‌లూమ్ కార్మికులకు జగన్ ఇచ్చిన సహాయాన్ని మించి, ఇంకెవరూ అంత సహాయం అందించలేదని అన్నారు.
 
నగరి ఆసుపత్రి పర్యటనకు సీఎం వెళ్లకపోవడం వెనుక అది జగన్ హయాంలో నిర్మించిందేనన్న భయమే కారణమని రోజా వ్యాఖ్యానించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు