Roja: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆర్కే రోజా... మాటలకు, చేతలకు సంబంధం లేదు
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభమైన కేవలం పదిహేను రోజుల్లోనే, వైకాపా నేత ఆర్కే రోజా పవన్ కళ్యాణ్‌ను కనీసం నాలుగు సార్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి సంబరాలలో పాల్గొని, పండుగ రోజున కూడా పవన్‌పై ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఉండటంపై ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు.
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని దివంగత వైఎస్సార్ తో పాటు వైఎస్ జగన్ నమ్మారని.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని.. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వారికి మేలు చేస్తున్నారని చెబుతూ... మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.
ఓడిపోతే పారిపోయే క్యారెక్టర్ తనది కాని రోజా అన్నారు. రెండుసార్లు ఓడిపోయి గెలిచానని రోజా గుర్తుచేశారు. ఓడిపోతే పారిపోయే బ్లడ్ తనది కాదని అన్నారు. జీవితాంతం నగరిలోనే ఉంటానంటూ రోజా స్పష్టం చేశారు.