సంబంధిత వార్తలు
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు
- దాబాలో మహిళపై సామూహిక అత్యాచారం.. సీసీటీవీలో అంతా రికార్డ్.. చివరికి?
- వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్లలో రెండు కాంస్య పతకాలను సాధించిన నాగిడి గాయత్రి
- తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్
పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?
మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందన్నది శాస్త్రీయంగా వాస్తవమని తేలింది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన శారీరక మరియు జీవసంబంధిత కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మగవారిలో మెటబాలిజం రేటు ఆడవారి కంటే సుమారు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. మగవారి మెటబాలిజం వేగంగా ఉండటం వల్ల వారి శరీరం సహజంగానే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.
మగవారి శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది. కండరాలు పని చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా వేడిని పుట్టిస్తాయి. ఆడవారి శరీరంలో సహజంగానే కొవ్వు శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు శరీరంలోని అంతర్గత అవయవాలను వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది, కానీ అది కండరాలలాగా కొత్తగా వేడిని ఉత్పత్తి చేయలేదు. అందుకే చర్మం ఉపరితలంపై ఆడవారికి చలి త్వరగా తెలుస్తుంది.
ఆడవారిలో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ రక్తాన్ని కొంచెం చిక్కబడేలా చేస్తుంది. దీనివల్ల చలిగా ఉన్నప్పుడు చేతులు, కాళ్లలోని చిన్న రక్తనాళాలకు రక్త ప్రసరణ కొద్దిగా తగ్గుతుంది. అలాగే, నెలసరి చక్రం సమయంలో శరీర ఉష్ణోగ్రతలో వచ్చే మార్పుల వల్ల కూడా చలి పట్ల సున్నితత్వం పెరుగుతుంది. చలి కాలంలో ఆడవారి శరీరం చాలా తెలివిగా పనిచేస్తుంది. ముఖ్యం కావాల్సిన అంతర్గత అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు వెచ్చగా ఉంచడానికి, రక్త ప్రసరణను శరీరం మధ్య భాగానికి ఎక్కువగా మళ్లిస్తుంది. దీనివల్ల చేతులు, పాదాలకు రక్త ప్రసరణ తగ్గి అవి త్వరగా చల్లబడతాయి. అందుకే మగవారి కంటే ఆడవారికి కాళ్లు, చేతులు త్వరగా గడ్డకట్టినట్లు అవుతాయి.
సాధారణంగా ఆడవారు మగవారి కంటే కొంచెం తక్కువ పరిమాణంలో ఉంటారు. చిన్న శరీరాలు వేడిని త్వరగా కోల్పోతాయి. కనుక శరీరం ఉపరితలం నుండి వేడి బయటకు వెళ్లే వేగం ఆడవారిలో ఎక్కువగా ఉండవచ్చు. ఆఫీసుల్లో ఉండే ఏసి ఉష్ణోగ్రతలను సాధారణంగా మగవారి శరీర తత్వానికి అనుగుణంగా సెట్ చేస్తారు. అందుకే ఆఫీసుల్లో మగవారికి నార్మల్‌గా ఉన్నా, ఆడవారు మాత్రం తరచుగా షాల్స్ లేదా స్వెటర్లు వాడుతుంటారు.
